Sunday, June 23, 2024

ఎసిబి వలలో జిఎస్‌టి అధికారి, ఎస్‌ఐ, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌లు

- Advertisement -
- Advertisement -

acb-net

 ఎస్‌ఐ పట్టివేతతో పరారైన జూబ్లీహిల్స్ సిఐ
రూ.35వేలు తీసుకుంటూ దొరికిన జిఎస్‌టి అధికారి
రూ. 15వేలతో పట్టుబడ్డ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ సహాయకుడు

మన తెలంగాణ/హైదరాబాద్ : /జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి : నగరంలో వేర్వేరు ప్రాంతాలలో గు రువారం నాడు రూ. 35 వేలు తీసుకుంటూ జిఎస్‌టి అధికారి, రూ. 50 వేలు అడ్మిన్ ఎస్‌ఐ, రూ. 15 వేలు తీ సుకుంటూ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, వ్యక్తిగత సహాయకుడు ఎసిబికి పట్టుబడ్డారు. ఒకే రోజు ముగ్గురు అవినీతి అధికారులను బాధితుల ఫిర్యాదు మేరకు వల పన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి ఒక సివిల్ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈక్రమంలో పోలీస్ స్టేషన్‌లో రూ. 50 వేల లంచంతో పాటు రెండు విదేశీ మద్యం బాటిళ్లు తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి ఎసిబికి పట్టుబడ్డాడన్న సమాచారం అందుకున్న సిఐ బల్వంతయ్య అక్కడి నుంచి పరార్ అయ్యారు. తనకు డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసి ఉడాయించాడు. ఈక్రమంలో లంచం తీసుకుంటూ దొరికిన ఎస్‌ఐ సుధీర్‌రెడ్డిని రెండు గంటల పాటు ఎసిబి అధికారులు విచారించారు. 2014 బ్యాచ్‌కు చెందిన సుధీర్‌రెడ్డి స్వస్థలం మెదక్ జిల్లాలోని గజ్వేల్ కాగా గత ఏడాదిన్నర కాలం గా జూబ్లీహిల్స్ పో లీస్ స్టేషన్‌లో ఎస్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా నగరంలోని నాంపల్లిలోని గగన్‌విహార్‌లో మొదటి అంతస్తులోని డిసిపివొ స్టేట్ జిఎస్‌టి అధికారి కొమ్మ బుచ్చయ్య రూ. 35వేలు లంచం తీసుకుంటుండగా ఎసి బి అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

ఓ వ్యాపారికి పన్ను మినహాయింపు కేసుకు సంబంధించి డిసిపివొ స్టేట్ జిఎస్‌టి అధికారి కొమ్మ బుచ్చయ్య రూ. 35వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. దీంతో ఎసిబి అధికారులు గురువారం ఉదయం నుంచి నాంపల్లి జిఎస్‌టి కార్యాలయం వద్ద కాపుకాసి కొమ్ము బుచ్చయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబికి పట్టుబడిన నలుగురిని అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపర్చగా వారిని 14 రోజలు రిమాండ్ విధించడం తో జైలుకు తరలించారు. ఇదిలావుండగా ఒకేరోజు ముగ్గురు అవినీతి అధికారులు హైదరాబాద్ నగరంలో పట్టుబడటం ఎసిబి చరిత్రలో తొలిసారని ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు.

ఇంటి ట్యాక్స్ తగ్గిస్తామని

శేరిలింగంపల్లిలోని బాపునగర్ నివాసముండే ఎజాజ్‌ఖాన్ తన 60 గజాల స్థలంలో జి ప్లస్ 2 భవనాన్ని నిర్మించుకున్నాడు.ఈ క్రమంలో ట్యాక్స్ అసెస్మెంట్ చేయాడానికి ఏడాదికి 20వేల కు పైగా చెల్లించాలంటూ ఎజాజ్ వద్దకు ట్యాక్స్ ఇన్స్‌పెకర్ట్ యాదయ్య,సాయిని రంగంలో దింపాడు. దీంతో సాయి భవన యాజమాని ఎజాజ్ ఖాన్ తో మాట్లాడి తమ అధికారిని కలిసి మాట్లాడుకోవాలని సూచించాడు. అయితే గతంలోనే యాదయ్య, సాయి ఆ వ్యక్తి నుంచి రూ. 15వేలు తీసుకున్నాడు. మరో రూ. 15 వేలు ఇస్తేనే ఆస్తి పన్ను తగ్గిస్తామని చెప్పి లంచం డి మాండ్ చేశారు.

బాదితుడు తాను అంత డబ్బును ఇచ్చుకొలేనని చెప్పడంతో లంచాల మొత్తాలు ఇస్తే ట్యాక్స్ తగ్గిస్తానని సాయి డిమాండ్ చేశాడు. దీంతో ఆ యజమాని అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు గురువారం రూ.15 వేలు లంచం ఇస్తుండగా యాదయ్య,అసిస్టెంట్ సాయిని రెడ్ హ్యండెడ్‌గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొన్న ఎసిబి అధికారులు శేరిలింగంపల్లి సర్కిల్ 20 కార్యాలయంలో సెక్షన్‌లో సోదాలు జరిపారు.

అదాలత్‌లో కేసు మాఫీ చేయిస్తామని

జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో రహ్మత్‌నగర్ సెక్టార్, అడ్మి న్ ఎస్సైగా పని చేస్తున్న సుధీర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పగడ్భందీ వ్యూహంతో పట్టుకున్నారు. సుధీర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు మూడు బృందాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. సమాచారం అందుకున్న సిఐ బలవంతరావు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ కేసు విషయంలో హోంశాఖ ఉన్నతాధికారుల స్థాయిలో చక్రం తిప్పినట్లు సమాచారం. ఎసిబి నాంపల్లి సెక్టార్ డిఎస్‌పి అచ్చేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం… సినీ పరిశ్రమలో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్న వంశీకృష్ణ ఓ మహిళకు రూ. 30 వేల రూపాయల విలువ చేసే ఉత్పత్తులను అందజేసేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నాడు. దీంతో సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు మహిళ జూబ్లీహిల్స్ పిఎస్‌లో వంశీకృష్ణపై ఫిర్యాదు చేసింది. ఎస్సై సుధీర్‌రెడ్డి ఫిర్యాదు నమోదు చేసుకొని గత నెల డిసెంబర్ 27న వంశీకృష్ణను స్టేషన్‌కు పిలిపించారు. ఈ కేసు విషయం సీఐ బలవంతరావు వరకు పోయింది.

సదరు ఎస్‌ఐ లంచం డిమాండ్ చేయడంతో అందుకు తలవంచని వంశీకృష్ణను మూడు రోజులపాటు ఇబ్బందులపాలు చేశారు. ఎంతకీ వినకపోయే సరికి వంశీకృష్ణపై గత నెల డిసెంబర్ 29న ఛీటింగ్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఈ కేసు విషయమై ఇద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి వంశీకృష్ణతో బేరసారాలు జరిపారు. చివరికి లక్ష రూపాయలు, విదేశీ మద్యం బాటిళ్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని వంశీకృష్ణ ఎసిబి అధికారులకు ఉప్పందించారు.

ఇందులో భాగంగా గురువారం రూ. 50వేలు, రెండు వ్యాట్ 69 విదేశీ మద్యం బాటిళ్లు ఇవ్వడానికి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10 వంశీకృష్ణ వెళ్లాడు. వీటిని తీసుకునేందుకు ఎస్సై సుధీర్‌రెడ్డి రావడంతో ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టున్నారు. విచారణలో సిఐ బలవంతరావు ఆదేశాల మేరకు తాను ఈ పని చేశానని, ఈ రూ. 50వేలలో రూ. 30వేలు సిఐకి, రూ. 20వేలు సుధీర్‌రెడ్డి పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఎసిబి డిఎస్‌పి అక్కేశ్వర్‌రావు తెలిపారు. సిఐ బలవంతరావు పరారీలో ఉన్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డిఎస్పీ తెలిపారు. క్రైం నెంబ 59/2019 కేసు నమోదు చేసిన్నట్లు చెప్పారు.

ఎస్‌ఐ కేసులో కొత్త ట్విస్ట్

రూ. 50వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి కేసులో కొత్తట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ సిఐ బల్వంతయ్య ఆదేశాల మేరకే ఎస్‌ఐ లంచం రూ. 50వేలు తీసుకున్నట్లు ఎసిబి డిఎస్‌పి అక్కేశ్వర్‌రావు తెలిపారు. ప్రస్తుతం సిఐ బల్వంతయ్య పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. సిఐ బల్వంతయ్యను కూడా విచారిస్తామని చెప్పారు. 2019 డిసెంబర్ 29న ఓ కేసులో స్టేషన్‌బెయిల్ ఇచ్చేందుకు, లోక్‌అదాలత్‌లో కేసును సెటిల్ చేస్తానంటూ ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ. 50 వేలను ఎస్‌ఐ తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఎసిబి డిఎస్‌పి తెలిపారు. డబ్బుతో పాటు 2 విదేశీ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

GST officer SI and Tax Inspector in ACB trap

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News