Tuesday, April 30, 2024

గుండాల మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా

- Advertisement -
- Advertisement -

గుండాల: గుండాల మండలాన్ని దత్తత తీసుకోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా వాసవి ఫంక్షన్‌హాల్‌లో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ది శూన్యమన్నారు.

40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూ సాను గాని గ్రామాలు, మండలాల అభివృద్ధి కో సం పని చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. గుండాల మండల అభివృద్ధికి గ తంలో ఎన్టీఆర్ కృషి చేయగా నేడు సీఎం కేసీఆర్ సంపూర్ణ అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పా రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తరువాతా దేవాతుల ప్రాజెక్టు నుండి సాగునీరు తీసుకవచ్చి పచ్చనిపంటపొలాలను గుండాలకు సీఎం పరిచ యం చేశారని చెప్పారు. రాష్ట్రంలో పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో ట్రిమిటోరియం, రైతువేదిక, ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీరు, సాగునీరు, మిషన్ కాకతీయతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథ కాలను అందించిన ఘతన కేసీఆర్‌దే అన్నారు. కరువు కాటకాలతో ఉన్న గుండాల మండలాన్ని దే వాదుల ప్రాజెక్టు సాగునీటితో శశ్యాస్యామలంగా మార్చారన్నారు. స్వయం సహాయ సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి మహిళ సంఘాలను బలోపేతం చేశారని చెప్పారు.

ప్రతీ గ్రామంలో న ర్సరీలను ఏర్పాటు చేసి గ్రామాలు పచ్చదనంతో ఉండేలా తీర్చిదిద్దారని చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు పారిశుధ్య నిర్వహణ, హ రితహారం మొక్కలకు నీరు అందించేలా ట్రాక్టర్ ట్రాలీలను సమకూర్చి గ్రామాల రూపురేఖలను మార్చారన్నారు. గుండాల మండలాన్ని దత్తత తీసుకోని అన్ని రకాల అభివృద్ధి చేస్తానని హామీ ఇ చ్చారు. అనంతరం సుద్దాల గ్రామంలో 14.50కో ట్ల వ్యయంతో నిర్మించిన బిక్కెరువాగులో చెక్‌డ్యామ్,కంబ్రీడెలను ప్రారంభించారు. చెక్‌డ్యామ్ ల ద్వారా రైతులకు సాగునీరు అందించడమే కా కుండా 24 గంటల వ్యవసాయ విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఆలేరు ఎ మ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పథి, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తీవారి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆర్ సునంద, డీఎల్‌పీవో కె యాదగిరి, గుండాల గ్రామ సర్పంచ్ వరలక్ష్మీప్రకాష్, ఎంపీపీ తాండ్రా అమరావతిఅశోక్, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండీ ఖలీల్, జడ్పీటీసీ లక్ష్మీరాములు, మాజీ జడ్పీటీసీ గడ్డమీది పాండరి, మందడి రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో పైళ్ళ జనార్ధన్‌రెడ్డి, మోత్కురు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, ఎంపీటీసీ కుంచల సుశీల అం జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News