Saturday, May 4, 2024

దళితబంధు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయండి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలపై అరణ్య భవన్ లో గురువారం హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు దళితబంధు లబ్ధిదారుల ఎంపికను మరింత వేగవంతం చేసి, మార్చి నెలాఖరు నాటికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ లు అధికారులను ఆదేశించారు. పురోగతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించాలని మంత్రులు అధికారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని చెప్పారు. ఆయా శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో వక్ఫ్ బోర్డ్, ఎస్సీ కార్పోరేషన్ల ఛైర్మన్లు మహ్మద్ సలీం, బండా శ్రీనివాస్, ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, రాహూల్ బొజ్జ, యోగితారాణ, నదీమ్ అహ్మద్, రోనాల్డ్ రాస్, దివ్యా దేవరాజన్, శ్రీదేవి, ఐపిఎస్ అధికారి షానవాజ్ ఖాసీం, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Harish Rao Review on Dalit Bandhu at Aranya Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News