Tuesday, April 30, 2024

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 20వేల మంది భారతీయులు..

- Advertisement -
- Advertisement -

Russia-Ukraine Crisis: 20k Indians stuck in Ukraine

కీవీ (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌పై రష్యాదాడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు ఎక్కడివారక్కడే ఆగిపోవాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు వేచి ఉండాలని భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల నుంచి ఆ దేశ రాజధాని కీవ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులంతా తిరిగి తమతమ ప్రదేశాలకు వెళ్లి పోవాలని కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ సూచనలే పాటించాలని కోరింది. ఇప్పటికే విదేశాంగ శాఖ భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఉక్రెయిన్ వివాదం తెరపైకి రాకముందు ఆ దేశంలో 22వేల మంది భారతీయులు ఉండేవారని అధికార వర్గాలు అంచనా వేశాయి. ఇందులో సుమారు వెయ్యిమంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తతలు ప్రారంభం కాగానే చాలామంది స్వదేశం బాట పట్టారు. మరికొందరు తాము చదువుతున్న యూనివర్శిటీల నుంచి సెలవు/ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి అధికారిక సమాచారం రాకపోవడంతో అక్కడే ఉండి పోయారు. ఉక్రెయిన్‌లో ఇంకా 20వేల మంది బారతీయులు ఉండవచ్చని అంచనా.

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
ఏపీఎస్‌ఆర్టీసీ ఈఓ దినేష్ 9848460046
నోడల్ ఆఫీసర్ రవిశంకర్ 9871999055
గీతేష్ శర్మ , స్పెషల్ ఆఫీసర్ 7531904820

ఎయిర్ స్పేస్ క్లోజ్
పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 21 నుంచి ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక నమూనాలు పంపారు. ప్రతీ విమానంలో రెండు వందల మంది వంతున ప్రయాణికులు భారత్‌కు గత రెండు రోజుల్లో చేరుకున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27న మూడు విమానాలు కీవ్ నుంచి న్యూఢిల్లీ రావాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎయిర్‌స్పేస్ మూసేయడంతో విమానసర్వీసులు దాదాపు రద్దయినట్టే . ఉక్రెయిన్‌లో కొంతమేరకు రక్షణగా ఉన్న పశ్చిమ ప్రాంతాల వారిని తిరిగి అదే ప్రదేశాలకు వెళ్లాలని బారత్ కోరింది.

Russia-Ukraine Crisis: 20k Indians stuck in Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News