Saturday, April 27, 2024

కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా?: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా..? అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. దొంగ రాత్రి కరెంట్, పేలిన ట్రాన్స్ ఫార్మర్లు, కాలిన మోటర్లు ఇదీ కాంగ్రెస్ హయాంలో కరెంట్ సంగతి అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలుపడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి చెప్పారు.

నీళ్లు లేకపోతే జీవం లేదు, నీళ్లు లేకపోతే బతుకు తెరువు లేదు.. అలాంటి జీవాన్ని, బతుకును సీఎం కేసీఆర్ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తిట్ల పోటీలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు. కానీ, సీఎం కేసీఆర్ వడ్లు పుట్లు పుట్లుగా పండించేందుకు పోటీ పడుతున్నారన్నారు. మన వడ్లు కొనడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అడుగున్నాయని, తెలంగాణను సీఎం కేసీఆర్ దేశ ధాన్యాగారంగా మార్చారని మంత్రి పేర్కొన్నారు. కాగా, బిఆర్ఎస్ పార్టీ, మంత్రి హరీష్ రావుకె మా మద్దతు అంటూ ఈ సందర్భంగా రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News