Thursday, May 9, 2024

మోడీకి స్వాగతం అవసరం లేదని వారే చెప్పారు: డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీకి బెంగళూరులో ఘన స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ స్పష్టం చేశారు. అయితే విమానాశ్రయం వద్దకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ రాకూడదంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అధికారిక వర్తమానం వచ్చిందని ఆయన వివరించారు. శనివారం చామరాజనగర్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

శనివారం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ స్వాగతం పలకలేదంటూ బిజెపి నాయకులు చేసిన విమర్శలపై శివకుమార్ స్పందిస్తూ తమకు ప్రొటోకాల్ గురంచి పూర్తిగా తెలుసునని, ఎవరిని ఏ విధంగా గౌరవించాలో కూడా తమకు తగిన రాజకీయ ్వగాహన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధాని మోడీ బెంగళూరుకు వచ్చారని, అది కూడా చంద్రయాన్ 3 విజయవంతం అయిన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి ఆయన నగరానికి వచ్చారని డికెఎస్ చెప్పారు.

త్వరలోనే కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పునర్వస్థీకరించనున్నట్లు డికెఎస్ తెలిపారు. కెపిసిసిలో ఉన్న చాలామంది మంత్రులు కావడం, కొత్త నాయకులకు అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే కెపిసిసిని పునర్వవస్థీకరించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆయన చెప్పారు.

బిజెపి ఎమ్మెల్యేలను తమలో కలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ హస్త చేపట్టినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తమకు ఆ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పార్టీ కార్యకర్తకు సొంత ఆశయాలు, అభీష్టాలు ఉంటాయని, తాము చేసిన ఐదు వాగ్దానాలకు సంబంధించిన ప్రయోజనాలు ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమానంగా అందచేస్తున్నామని డికెఎస్ చెప్పారు. తాము చేపట్టిన కార్యక్రమాల వల్ల ఆయా నియోజకవర్గాలలో ప్రయోజనం పొందిన ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తే అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News