Monday, May 20, 2024

ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -
నేటి నుంచి జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు,  1 నుంచి తరగతులు ప్రారంభం,  గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేరాలి, ఇంటర్ బోర్డు సూచన

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూ నియర్ కళాశాలల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాల షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 9 నుంచి జూన్ 30వ తేదీ వరకు తొలివిడత అడ్మిషన్లు చేపట్టాలని తెలిపింది. ఈ నెల 9 నుంచి 31 వరకు దరఖాస్తులు ఫారాలు చేయనున్నట్లు పేర్కొన్నది. ప్రభు త్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ – ఎయిడెడ్, కో -ఆపరేటివ్, టిఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రై బల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ, కెజిబివి, టిఎస్ మోడల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభించాలని వెల్లడించింది.

జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతలు ప్రారంభించాలని బోర్డు ఆదేశించింది. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రొవిజనల్ అడ్మిషన్లు చేయాలని పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్‌లు సమర్పించిన తర్వాత అడ్మిషన్లు ఖరారు చేయాలని తెలిపింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలలో ఎస్‌సిలకు 15 శాతం, ఎస్‌టిలకు 10 శాతం, బిసిలకు 29 శాతం, వికలాంగులకు 5 శాతం, ఎన్‌సిసి, స్పోర్ట్ కోటాకి 5 శాతం, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా 3 శాతం, ఇడబ్ల్యూఎస్‌కి 10 శాతం సీట్లు, మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.

ఈ మేరకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు అడ్మిషన్ల ప్రక్రియ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు బోర్డు సూచించింది. ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల వివరాలు www.acadtsbie.cgg.gov.in, www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్‌సైట్‌లో కళాశాలకు గుర్తింపు ఉందా..? లేదా..? అన్న విషయాన్ని నిర్థారించుకున్న తర్వాతనే ప్రవేశాలు పొందాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News