Friday, April 26, 2024

కెనడాలో హ్యారీ దంపతుల కొత్త జీవితం

- Advertisement -
- Advertisement -

Harry's Couples

 

విక్టోరియా (కెనడా) : బ్రిటన్ రాజకుటుంబం నుంచి విడిపోయిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘాన్ మంగళవారం నుంచీ కెనడాలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సముద్రతీర ంలో తాము ఉంటున్న ప్రాంతంలో డచెస్ ఫోటోలు తీయవద్దని ఆ దంపతులిద్దరూ మీడియాను హెచ్చరించారు. బ్రిటన్ రాజరికపు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించి షాకిచ్చిన హ్యారీ భార్య మెఘాన్‌ను కలుసుకునేందుకు బ్రిటన్ నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయాక వాంకూవర్ దీవిలో విక్టోరియా వెలుపల ఉన్న విలాసవంతమైన భవనానికి చేరుకున్నారు. క్రిస్మస్ తర్వాత ఆరువారాలపాటు తమ బేబీ ఆర్చీతో అక్కడ గడిపిన ససెక్స్ డ్యూక్, డచెస్ ఒక ఉడ్ హౌస్‌ను తమ తాత్కాలిక నివాసంగా ఎంచుకున్నారు. తాము రాజరికపు విధుల నుంచి తప్పుకుంటున్నట్టు జనవరి 8న వారు చేసిన ప్రకటన రాజకుటుంబంలో ప్రకంపనాల్ని సృష్టించింది.

Harry Couples new life in Canada
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News