Thursday, May 2, 2024

ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి: విసి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

VC-Sajjanar

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 12మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల కేంద్రాలను ఆయన సందర్శించారు. నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీల్లోని వివిధ పోలింగ్ కేంద్రాలను సిపి సందర్శించారు. ఈ సందర్భంగా సిపి విసి సజ్జనార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముందుగా చర్యలు తీసుకోవడంతో ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, కౌంటింగ్ మొత్తం ఎన్నికల ప్రక్రియలపై పటిష్ట నిఘా పెట్టామని తెలిపారు. పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా అని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేశారని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల విధుల్లో 4,500మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

ముగ్గురు డిసిపిలు, ఆరుగురు ఎడిసిపిలు, 15మంది ఎసిపిలు, 60మంది ఇన్స్‌స్పెక్టర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమును సిపి సజ్జనార్ పరిశీలించారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు, ఎడిసిపి ఎస్‌బి గౌస్‌మోహియుద్దిన్, ఎడిసిపి మాణిక్ రాజ్, మాదాపూర్ ఎసిపి శ్యామ్ ప్రసాదరావు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

VC Sajjanar Says Elections Were Held Peacefully

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News