Thursday, May 2, 2024

పన్నెండు నెలల వేతనం మంజూరుపై హర్షం

- Advertisement -
- Advertisement -

తానూర్ : గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు పన్నెండు నెలల వేతనం మంజూరు చేయడం పై తానూర్ ఆశ్రమ పాఠశాల సిఆర్‌టిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే తమ సర్వీస్ నుక్రమ బద్దీకరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 8 న హైదరాబాద్‌లో బంజారా భవన్‌లో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి మంత్రులు సత్యవతి రాథోడ్, హరీష్ రావు, గిరిజన శాసన సభ్యులు హాజరవుతున్నారని కావున నిర్మల్ జిల్లాలోని సిఆర్‌టిలు అందరూ కుటుంబాలతో హాజరుకావాలని కోరారు. వీరికి సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండన్నగారి కృష్ణారావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి మద్దతు తెలిపారు. సిఆర్‌టిలు గణపతి, రమేష్, నితిన్, కోట చారి, లక్ష్మీ, రవీంధర్, దేవిదాస్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News