Thursday, April 25, 2024

బాదం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం

- Advertisement -
- Advertisement -

Almonds

హైదరాబాద్: అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి బాదం మెరుగైన ఆరోగ్యం అందిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అత్యంత కీలకమైన పోషకాలపై విటమిన్ ఈ, మెగ్నీషియం, గుడ్ ఫ్యాట్, డైటరీ ఫైబర్స్‌తో పాటు ప్లాంట్ ప్రొటీన్‌కు చక్కటి వనరుగా బాదం ఉంటుందని చెప్పారు. ఈసందర్బంగా సూపర్‌మోడల్ మిలింద్ సోమన్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించడంలో అతిముఖ్యమైన భాగం ఏమిటంటే తరుచుగా వ్యాయామాలను కూడా చేయడం, నేను పరుగును ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.

సంపూర్ణమైన స్నాక్స్ ఆల్మండ్స్ తీసుకుంటానని, ఇవి 15 అత్యవసర పోషకాలైనటువంటి మెగ్నిషియం , రిబోప్లావిన్, జింక్‌లాంటివి కలిగి ఉంటాయని తెలిపారు. అనంతరం నటి సోహా అలీఖాన్ ప్రసంగిస్తూ ప్రతి ఒకరు సమాచారయుక్త స్నాక్స్ ప్రాధాన్యతలను ఎంచుకోవాలని, బాదం లాంటి స్నాక్స్‌ను, తాజా పండ్లను తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈకార్యక్రమంలో న్యూట్రిషియన్ షీలా కృష్ణస్వామి మాట్లాడి ఆరోగ్య సమస్యలపై విలువైన సూచనలు చేశారు.

Health Benefits of Almonds

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News