Tuesday, April 30, 2024

అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్ 5కి వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే, ఇరు పక్షాల నుంచి అత్యవసరంగా అభ్యర్థనలు ఉన్నప్పటికీ కోర్టు ఈరోజు తీర్పు వెలువరించలేకపోయింది. అత్యవసర పరిస్థితుల్లో తీర్పు కోసం ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించవచ్చని జస్టిస్ సురేంద్ర సూచించారు.

Also Read: దారినపోయే దానయ్య ఫిర్యాదు చేస్తే.. బిసి మంత్రిని ఎలా తీసేశారు?

వేసవి సెలవుల కారణంగా రేపటి నుంచి మూతపడుతుందని, సెలవుల అనంతరం తీర్పును వెలువరిస్తామని కోర్టు పేర్కొంది. సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈరోజు వాదనలు వినిపించగా, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును అన్ని రోజుల పాటు రిజర్వ్ చేయడం అవివేకమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. విచారణ జూన్ 5కి వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News