Sunday, April 14, 2024

వడ దడ తప్పదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఈసారి వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని… తెలుగు రాష్ట్రాల్లో భారీగా వడగాల్పులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయన్న అంచనాల మేరకు ఎండల ప్రభావంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఈశాన్య భారతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక , మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

మార్చి నుంచి మే మధ్యలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతుండటం వల్ల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాలు వేడెక్కడం , వేసవికాలమంతా కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News