Monday, April 29, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు భాతర వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి ఇది దిశను మార్చుకొని ఒడిశా తీరం వైపు తీవ్ర వాయుగుండంగా కదిలే సూచనలు కనిపిస్తున్నట్టు తెలిపింది. తమిళనాడుకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఏపిలో కూడా కోస్తా తీర ప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపున కిందిస్థాయిలో గాలులు ఉత్తర ,ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయి. రాష్ట్రంలో మరో 48గంటలపాటు పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News