Friday, April 26, 2024

ముషారఫ్ మరణశిక్షకు హైకోర్టు బ్రేక్

- Advertisement -
- Advertisement -

Musharraf

 

లాహోర్ : స్వీయ ప్రవాసంలో ఉన్న పాకిస్థాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్‌కు కోర్టుపరంగా ఊరట దక్కింది. ఆయనకు మరణశిక్ష విధించాలనే తీర్పు చెల్లనేరదని లాహోర్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన మరణశిక్ష తీర్పును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. మరణశిక్ష తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని లాహోర్ హైకోర్టు త్రిసభ్య విస్తృత ధర్మాసనం పేర్కొంది. రాజద్రోహం నేరం పరిధిలో ముషారఫ్‌పై ప్రత్యేక న్యాయస్థానం ఆరేళ్ల పాటు విచారణ జరిపింది.గత నెల 17వ తేదీన తీర్పు వెలువరించింది. ఇప్పుడు లాహోర్ హైకోర్టు వెలువరించిన తీర్పులో అసలు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు ప్రక్రియనే అనుచితం అని పేర్కొంది. మరణశిక్ష తీర్పు చెల్లకుండా పోతుందని స్పష్టం చేశారు.

High Court breaks Musharraf death sentence
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News