Wednesday, September 24, 2025

బిసి రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని హైకోర్టులో దాకలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యం బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం పిటిషనర్లపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలతో పిటిషన్లను వేశారని ధర్మాసనం నిలదీసింది. పత్రికల్లో కథనాల ఆధారంగా పిల్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేస్తూ రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. 42 శాతం రిజర్వేషన్లు బిసిలకు కేటాయిస్తూ ప్రభుత్వం తెస్తున్న జీవోపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఆదేశాలు ఇవ్వాలని, 42 శాతం బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలని పిటిషనర్లు కోరారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే స్థానిక సంస్థల్లో ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తే 50 శాతం దాటుతుందని, సుప్రీంకోర్టు తీర్పు, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 50 శాతం మించకూడదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రెండు పిటిషన్లను కొట్టివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News