Friday, April 26, 2024

సచివాలయ నిర్మాణ, అంచనా వ్యయం వివరాలు ఇవ్వండి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Hight Court

మన తెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నూతన సచివాలయం నిర్మాణాన్ని ఆపేయాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అదనపు ఎజి రాంచందర్‌రావు వాదనలు వినిపించారు. సచివాలయం కూల్చివేతపై మాత్రమే స్టే ఇచ్చామన్న న్యాయస్థానం.. డిజైన్, అంచనా వ్యయం వంటి అంశాలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. సచివాలయ నిర్మాణం, అంచనా వ్యయం వివరాలు ఇవ్వాలని అదనపు ఎజి రాంచందర్‌రావుని ధర్మాసనం ఆదేశించింది. నూతన సచివాలయ నిర్మాణానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని అదనపు ఎజి ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణను న్యాయమూర్తి వచ్చే నెల 12కు వాయిదా వేశారు.

High Court hear on New Secretariat built

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News