Friday, May 3, 2024

పొగమంచు తెరలో హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

Hyderabad City is Shrouded in Fog

హైదరాబాద్: పొగమంచు తెరలో హైదరాబాద్ నగరం చిక్కుంది. ఉదయం 8గంటల వరకు నగరాన్ని పొగమంచు కప్పివేయడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటీకే రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలితో గజగజ వణికిపోతున్న నగరవాసులను పొగమంచు సైతం ఇబ్బందులు పెడుతోంది. శనివారం ఉదయం నగరాన్ని పూర్తిగా పొగమంచు కప్పివేయడంతో వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు సైతం దట్టంగా పోగమంచు అలుముకోవడంతో దాదాపు రోడ్లపై వాహనాలు నిలిచిపోయ్యాయి. లైట్లు వేసుకున్న రోడ్లు కనిపించకపోవడంతో చాలా మంది వాహనదారులు పోగమంచు వెళ్లే వరకు రహదారుల పక్కన వాహనాలు నిలుపుకున్నారు. మరోవైపు వాకింగ్‌కు వెళ్లే వారు సైతం పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఏమి కనిపించని పరిస్థితి ఉండడంతో చాల మందికి ఇంటికే పరిమితమైయ్యారు. సూర్యుడి ఉదయించిన తర్వాత క్రమంగా పొగమంచుమయం కావడంతో కొంత మంది జాగింగ్ వెళ్లారు.

శివారు ప్రాంతాలు గజగజ

నగర శివారు ప్రాంతాల్లో చలి విజృంభిస్తుండడంతో ఆ ప్రాంత వాసులు చలితో వణికి పోతున్నారు. రామచంద్రాపురం సర్కిల్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10.8 డిగ్రీలు నమోదైంది. అదేవిధంగా శేరిలింగంపల్లి సర్కిల్ కనిష్ట ఉష్ణోగత్ర11.3 డిగ్రీలుగా నమోదు కాగా , పగటి ఉష్ణోగ్రత (గరిష్టం)26 డిగ్రీలకు పడిపోవడంతో ఈ ప్రాంతం ఉయయం 11 గంటల వరకు చలిగానే ఉంది. అల్వాల్‌లో 13.1 మారెడ్‌పల్లిలో 13.3 కుత్బుల్లాపూర్‌లో 13.4 ఉప్పల్, రాజేంద్రనగర్ 13.6 గొల్కోండ 14.2గా కనిష్ట ఉష్ణోగత్రలు నమోదుగా కాగా గరిష్ట ఉష్ణోగ్రతలు 26 నుంచి 27 మధ్య నమోదు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News