Monday, May 6, 2024

ప్రాణాలు తీస్తున్న ‘మైనర్’ డ్రైవర్లు!

- Advertisement -
- Advertisement -

Minor drivers are causing accidents in Hyderabad

హైదరాబాద్: మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు, బైక్‌లను కొనివ్వవద్దని పోలీసులు ఎంతగా చెబుతున్నా తల్లిదండ్రులు వినడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు చేస్తూ మైనర్లు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల హబ్సీగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రోడ్డు దాటుతున్న సుబ్బారావు బైక్ నడుపుతున్న మైన్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. బైక్‌నడుపుతున్న బా లుడు డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నాడు. ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. తల్లిదండ్రులు బైక్‌ను కొనివ్వడంతో దానిపై బయటికి వచ్చి కూతురు పరీక్షా కేంద్రాన్ని చూసేందుకు వచ్చిన తండ్రి మృతిచెందాడు. ప్రగాటూల్స్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సుబ్బారావు తన అవిటి కూతురు సిఎ పరీక్షకు సిద్ధమవుతోంది.

దీంతో మరుసటి రోజు ఆమెకు పరీక్ష ఉండడంతో పరీక్ష కేంద్రం హబ్సీగూడలో ఉంది, దానిని చూసేందుకు వెళ్లాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును బా లుడు వారి ఇంటికి తీసుకువచ్చి దింపివెళ్లాడు. త ర్వాత పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్దదిక్కు పరిస్థితి నెలకొంది. మై నర్లు వాహనాలు నడపడమే నేరమంటే అందులో హెల్మెట్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాహనాలు నడిపే మైనర్లే కాకుండా వాహనాలను ఇచ్చిన తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించిన కూడా మార్పు రావడంలేదు.

పెరుగుతున్న మైనర్ డ్రైవర్లు…..

పిల్లలకు బైక్‌లు ఇవ్వవద్దని పోలీసులు పలుమార్లు తల్లిదండ్రులకు చెబుతున్నా వినడంలేదు. చిన్నచిన్న పనులకు పిల్లలకు బైక్‌లను ఇస్తున్నారు. వారికి బైక్‌ను కంట్రోల్ చేసే సార్థం లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇలా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదిలో 4,610 మంది మైనర్లపై కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది 1,382 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులను పిలిచి మైనర్లకు వాహనాలను ఇవ్వవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలను ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇలా పలు విధాలుగా కౌన్సెలింగ్ నిర్వహించినా కూడా వాహనాలు ఇవ్వడం మానడంలేదు.

గల్లీల్లో పోలీసుల తనిఖీలు….

మైనర్లు డ్రైవింగ్ ఎక్కువ కావడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంతో పోలీసులు గల్లీల్లో కూడా తనిఖీలు చేపట్టారు. వాహనాలు నడుపుతున్న వారికి , వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. స్థానిక అవసరాలకు కూడా కిరాణ షాపులకు వెళ్లేందుకు బైక్‌లను ఇవ్వవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా పాల ప్యాకెట్లు తెచ్చేందుకు ఎక్కువగా ఉదయం సమయంలో పిల్లలకు బైక్‌లను ఇస్తున్నారు. ఈ సమయంలో పిల్లలకు బైక్‌లపై వెళ్లి రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా గల్లీల్లో పోలీసులు తనిఖీ చేయరనే ఉద్దేశంతో మైనర్లు వాహనాలు నడుపుతున్నారు. ఈ ప్రాంతాల్లో కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంతో పోలీసులు వాటిపై దృష్టి సారించారు. తరచూ గల్లీల్లో కూడా తనిఖీలు చేస్తు మైనర్లు వాహనాలతో రోడ్లమీదకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Minor drivers are causing accidents in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News