Saturday, April 20, 2024

దుబాయ్ విమానాశ్రయంలో.. హైదరాబాదీల కష్టాలు

- Advertisement -
- Advertisement -

Dubai airport

 

మధ్యలో చిక్కుపడ్డారు
తమ వారితో మాట్లాడలేరు
కనెక్టివ్ ప్లేన్‌లలో తీవ్ర జాప్యం

దుబాయ్/హైదరాబాద్ : దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లే వందలాది మంది భారతీయ ప్రయాణికులు దుబయ్ ఎయిర్‌పోర్టులో నానా కష్టాలకు గురవుతున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గంటల కొద్ది ఆలస్యం తరువాత దుబయ్‌కు బయలుదేరిన విమానాలకు తరువాతి కనెక్టివ్ విమానాలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచనిస్థితికి గురవుతున్నట్లు వెల్లడైంది. దుబయ్‌లో ఆద్యంతం రద్దీగా ఉండే అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే విమానాలను భారీ వర్షాలతో దారిమళ్లించారు. భారీ వర్షాలతో ఇంటర్సేషనల్ ఎయిర్‌పోర్టులోని టర్మినల్ 1 పూర్తిగా జలమయం అయింది. ఇక దుబయ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు తరువాత విమానాలు అందుబాటులో లేకపోవడం, విమానాశ్రయం నుబచి బయటకు వెళ్లే విమానాలు కూడా ప్రతికూల వాతావరణంతో రద్దు కావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిని ఎదుర్కొంటున్నట్లు అతి కొద్ది మంది తమ వద్ద ఉన్న అత్యంత అధునాతమైన ఫోన్ల ద్వారా అటు అమెరికాలోని ఇటు భారత్‌లోని తమ వారికి తెలియచేసుకుంటున్నట్లు వెల్లడైంది.

అయితే ఫోన్ కనెక్షన్లు పోయిన వారు , తొలిసారిగా దుబయ్ మీదుగా వెళ్లుతున్న వారు, అసలే హిందీ రాని వారు మరిన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారు. అతి కష్టం మీద చాలా మందికి తమ కనెక్టివ్ విమానాలు ఈ నెల 14 ఆ తరువాతి తేదీలలో ఉన్నట్లు తేలడంతో రెండు మూడు రోజులు ఏ విధంగా ఉండాలి? తమ వారికి ఏ విధంగా సమాచారం అందించాలనే భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు. విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు ఉన్నట్లు నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రయాణికులు తమ వారికి తెలియచేసుకుంటున్నారు. తాము దుబయ్ మీదుగా అమెరికాకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నామని, అయితే ఇప్పుడు దుబయ్‌లో చిక్కుపడ్డ తమ పరిస్థితి గురించి విమానయాన సంస్థల నిర్వాహకులు కనీస జవాబులు కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెలువడ్డాయి.

ప్రయాణికుల గురించి వారి బంధువులకు, వారు చేరుకోవల్సిన చోట్లలోని వారికి ఎటువంటి సమాచారం వెళ్లడం లేదని వెల్లడైంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయానికి చేరుకున్న తరువాత విమానాలు లేకపోవడంతో ప్రయాణికులు ఉండేందుకు కల్పించిన వసతి, భోజన సౌకర్యాల విషయంలో కూడా విమానయాన సంస్థల వారు నిర్లక్షం వహిస్తున్నట్లు, ఇక విద్యాధికులు కాని వారు నానా అగచాట్లకు గురవుతున్నట్లు వెల్లడైంది. అయితే ఇది కేవలం గంటల వ్యవధిలో పరిష్కారం అయ్యే సమస్య అని, పలు విమానాలు ఒకేసారి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ విమానాశ్రయానికి రావడంతో అనివార్యంగా పరిస్థితి గందరగోళంగా మారిందని, కొంచెం తెరిపినివ్వగానే అంతా సర్దుకుంటుందని అధికారులు తెలియచేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఎయిర్‌పోర్టులో ఏమిరేట్స్ అధికారులు ఎవరూ అందుబాటులో లేరని, తాము వచ్చి కొద్ది గంటలు అయిపోతున్నా తమకు ఎటువంటి సమాచారం లేదా ఉండేందుకు ఏర్పాట్లు కానీ లేవని తమిళనాడుకు చెందిన ఒక ప్రయాణికుడు తెలిపారు.

ఆ వ్యక్తి దుబయ్ మీదుగా అమెరికాకు వెళ్లుతున్నాడు. సీటెల్, శాన్‌ఫ్రాన్సిస్‌కో, బోస్టన్, ఫ్లోరిడాలు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని దుబయ్ మీదుగా వెళ్లితే బాగుంటుందని ప్రోత్సహించిన విమానయాన సంస్థలు ఇప్పుడు ఈ వాతావరణంలో తమ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆ వ్యక్తి ఆరోపించారు. భారీ వర్షాలతో చాలా విమానాలకు అంతరాయం ఏర్పడిందని, ప్రయాణికులు తమ విమాన తదుపరి ప్రయాణాలను తగు విధంగా నెట్ ద్వారా తెలుసుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు సమాచారం వెలువరించారు. ఇక హైదరాబాద్ నుంచి ఒంటరిగా పలువురు మహిళలు, పెద్ద వారు , కొత్తగా అమెరికాకు వెళ్లే వారు దుబయ్‌లో చిక్కుపడ్డారు. వీరి గురించి అటు అమెరికాలోని వారివారికి, ఇటు హైదరాబాద్‌లోని ఆత్మీయులకు తగు సమాచారం లేదని వెల్లడయింది. ఇక ఆయా ప్రాంతాల్లోని వారు కూడా దుబయ్ విమానాశ్రయంలో ఉండాల్సి వచ్చిన వారు తమ పరిస్థితిని ఏ విధంగా తెలియచేయాలో తెలియక కంగారుపడుతున్నారు. సమాచార వినిమయ విషయంలో అయోమయంతో పరిస్థితి దారుణంగా మారిందని వెల్లడైంది.

Hyderabad people misery at Dubai airport
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News