Saturday, April 27, 2024

టాట్ పబ్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

 Tat Pub

 

పోలీసుల అదుపులో 22 మంది యువతులు

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని లోని టాట్ పబ్‌లో న్యూడ్ డ్యాన్స్ చేయిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. కాగా ఓ వ్రైవేటు సంస్థ ఈ పబ్‌లో ప్రత్యేకగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో యువతీ, యువకులు ఉన్నప్పటికీ ఎలాంటి అశ్లీల నృత్యాలు కనిపించలేదని పోలీసులు ప్రాధమికంగా తెలిపారు. అయితే ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన వారి వివరాలను, గుర్తింపు పత్రాలను పోలీసులు పరిశీలించారు.

ఇదిలావుండా టాట్‌పబ్‌లో ముజ్ర పార్టీ, అశ్లీల డ్యాన్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఎక్సైజ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కాగా పబ్‌లో నృత్యాలు చేస్తున్న 22 మందిని యువతులను అదుపలోకి తీసుకుని ప్రైవేట్ బస్సులోజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పబ్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశామని, 22 యువతులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ పబ్‌లో జరుగుతున్న ప్రైవేటు పార్టీలో మైనర్లు ఎవరైనా ఉన్నారా అన్న కోణలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Police attack Tat Pub in Jubilee Hills
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News