Thursday, April 25, 2024

మిక్స్ మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ

- Advertisement -
- Advertisement -

vijay devarakonda

 

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ త్వరలో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో పూరి మంచి ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. ‘ఫైటర్’ పేరుతో రూపొందే ఈ సినిమాను ఛార్మీ కౌర్, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండకు మిక్స్ మార్షల్ ఆర్ట్, ఇతర పోరాట కళల్లో శిక్షణ ఇవ్వడం కోసం నిర్మాతలు 15 మంది ట్రైనర్స్‌ను నియమించడం విశేషం. ‘ఫైటర్’లో ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్న విజయ్ ప్రస్తుతం ఆ ట్రైనర్స్ దగ్గర కఠిన శిక్షణ తీసుకోవడంతో పాటు కఠిన ఆహార నియమాలను పాటిస్తున్నాడు. ఈ నెలాఖరులో ముంబయ్‌లో ‘ఫైటర్’ చిత్రీకరణ మొదలవుతుంది. కాగా క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో విజయ్ నటిస్తోన్న ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

Training in Mix Martial Art
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News