Thursday, February 22, 2024

భారీ అక్రమ కట్టడాలు.. క్షణాల్లో నేలమట్టం (వీడియో)

- Advertisement -
- Advertisement -
demolished
సుప్రీం ఆదేశం మేరకు కేరళ అధికారుల ఆపరేషన్

కోచి : అక్రమంగా కట్టిన రెండు విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను అధికారులు శనివారంనాడు సెకన్లలో నేలమట్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. మారడు మున్సిపాలిటీలో నిర్మించిన ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు భారీగా పేలుడు సామగ్రిని ఉపయోగించారు. కంట్రోల్డ్ ఇంప్లోజన్ పద్ధతి ద్వారా హోలీ ఫెయిత్ హెచ్2ఓ, రెండు టవర్లున్న అల్ఫా సెరెన్ అపార్ట్‌మెంట్‌ను వరసగా ఉదయం 11.18 గంటలకు, 11.46 గంటలకు కూల్చేశారు. ఆదివారంనాడు మరో రెండు అపార్ట్‌మెంట్‌లు జైన్ కోరల్ కోవ్, గోల్డెన్ కయలోరంలను కూడా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం కూల్చేస్తారు.

రెండు భవనాల్లోని వివిధ అంతస్థుల స్తంభాల్లో పేలుడు పదార్థాలను ఉంచి జరిపిన ఈ కూల్చివేతలో ఉక్కు చట్రాలు ధ్వంసం కావడంతో సెకన్ల వ్యవధిలోనే 19 అంతస్థులతో 60 మీటర్ల ఎత్తున్న 91ఫ్లాట్ల హోలీ ఫెయిత్ కూలిపోయింది., అలాగే 17 అంతస్థుల అల్ఫా కాంప్లెక్స్‌లో 67 ఫ్లాట్లున్నాయి. కూలిన తర్వాత కొన్ని నిముషాల దాకా గాలిలో దట్టమైన దుమ్ము వ్యాపించింది. తర్వాత అది భవన శిథిలాలపై మందంగా పరుచుకుంది. ఈ కూల్చివేత ఘట్టాన్ని వేలాదిమంది దూరంగా ఉండి చేశారు. శనివారం చేపట్టిన కార్యక్రమం విజయవంతమైనందుకు అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

video courtesy by TOI

Illegal Apartment Complexes in Kochi Demolished Down

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News