Sunday, October 6, 2024

పడిక్కల్ హాఫ్ సెంచరీ…. ఇండియా డి జట్టు 132/6

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా డి, ఇండియా ఎ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా డి జట్టు 43 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇండియా డి జట్టు 158 పరుగులు వెనుకంజలో ఉంది. ఇండియా డి జట్టు నుంచి దేవ్‌దూత్ పడిక్కల్ ఒక్కడే బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సంజూ శామ్సన్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమయ్యారు. ఇండియా డి జట్టు బ్యాట్స్‌మెన్లలో శ్రేయస్ అయ్యర్ డకౌట్ రూపంలో వెనుదిరగా సంజూ శామ్సన్(05), రీకి భూయ్(23), యశ్ దూబే(14), అథర్వ టైడ్(04), సరాన్ష్ జైన్(08) పరుగులు చేసి మైదానం వీడారు. ప్రస్తుతం క్రీజులో దేవ్‌దూత్ పడిక్కల్(66), సౌరభ్ కుమార్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇండియా ఎ జట్టు బౌలర్లు ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా అఖిబ్ ఖాన్ రెండు వికెట్లు, తానౌష్ కోటియన్ ఒక వికెట్ తీశారు. ఇండియా ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News