Wednesday, October 9, 2024

గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు.. ట్యాంక్ బండ్పై అనుమతి లేదు:సీపీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో గణేష్‌ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిపి సివి ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నాని చెప్పారు. వినాయకుడి నిమజ్జనాల నేపథ్యంలో సిటీ పరిధిలో 15 వేలు.. ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు.ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో గణేష్ నిమర్జనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

కాగా.. నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని గణనాథులు ట్యాంక్ బండ్ వైపు కదులుతాయి.దీంతో గణేష్ శోభయాత్రలు చూసేందుకు పెద్ద ఎత్తున నగర వాసులు అక్కడి చేరుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News