Thursday, October 10, 2024

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు… భక్తులకు నో ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కర్ర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. మహాగణపతి దగ్గరకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. బడా గణేష్ దగ్గరకు భక్తులకు అనుమతి నిరాకరించడంతో పాటు నాలుగు వైపులా బారికేడ్లనే పోలీసులు ఏర్పాటు చేశారు. దర్శనం నిలిపివేత విషయం తెలియక బడా గణేశుడి దగ్గరకు భారీగా భక్తులు తరలివచ్చారు. అనుమతి లేకపోవడంతో భక్తులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది. ట్యాంక్‌బండ్ దగ్గర గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హుస్సేన్‌సాగర్ చుట్టూ 31 భారీ క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్‌టిఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News