Tuesday, October 15, 2024

సీఎం రేవంత్ కు రూ.కోటి విరాళం అందజేసిన మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. సోమవారం జూబిహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్ళిన చిరంజీవి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం సహాయనిధికి తన తరుపున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరపున మరో రూ.50లక్షల విరాళం అందజేశారు. రెండు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి అందజేశారు.

అలాగే.. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధిక మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి రూ.కోటి విరాళం అందజేశారు.సినీ నటుడు అలీ రూ.3లక్షలు, నటుడు విశ్వక్ సేన్, సాయి దుర్గ తేజ్ లు చెరో రూ.10లక్షలు చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులను అందజేశారు.ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు భారీగా ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. చాలా మంది ఇండ్లు కోల్పోయి నిరాశ్రులయ్యారు. కొన్ని ప్రాంతాల్లో వరదలు గ్రామాలను ముంచెత్తాయి. పలు రోడ్లు ధ్వంసమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తేలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News