Thursday, October 10, 2024

సెంచరీలతో మెరిసిన సింగ్, తిలక్ వర్మ… ఇండియా ఎ 380 డిక్లేర్డ్

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఎ-ఇండియా డి మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఇండియా ఎ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 380 పరుగులు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో ఇండియా ఎ జట్టు 488 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రథమ్ సింగ్(122), తిలక్ వర్మ(111) సెంచరీలతో మోత మోగించారు. మయాంక్ అగర్వాల్(56), శశావత్ రావత్ (64) హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. రియాన్ పరాగ్ 20 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇండియా డి బౌలర్లలో సౌరభ్ కుమార్ రెండు వికెట్లు తీయగా శ్రేయస్ అయ్యర్ ఒక వికెట్ తీశాడు.

ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్: 290
ఇండియా డి తొలి ఇన్నింగ్స్: 183

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News