Saturday, April 27, 2024

సామాజిక చైతన్యంలో అట్టడుగున భారత్

- Advertisement -
- Advertisement -

Social Mobility Index

 

82 దేశాల జాబితాలో 76వ స్థానం
అగ్రస్థానంలో స్కాండినేవియా దేశాలు

దావోస్: ప్రతి మనిషీ అతని సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా జీవితంలో తన పూర్తి సామర్థాన్ని నెరవేర్చుకోవడానికి తగిన అవకాశాలు ఉండే సమాజాలను సృష్టించే సామాజిక చైతన్యం కొలమానాల విషయంలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్లు ఇఎఫ్) తొలి సారిగా రూపొందించిన సామాజిక చైతన్యం సూచీ ( సోషల్ మొబిలిటీ ఇండెక్స్)లో 83 దేశాల్లో మన దేశం 76వ స్థానంలో నిలిచింది. కాగా ఈ జాబితాలో పేర్కొన్న అన్ని సూచీలలోను డెన్మార్క్ అగ్ర స్థానంలో నిలిచింది. ఆదాయ అసమానతలను తొలగించడానికి ప్రధానమైన సామాజిక చైతన్యం 10 శాతం పెరిగితే 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 5 శాతం పెరుగుతుందని డబ్లు ఇఎఫ్ పేర్కొంది.

ఆరోగ్యం, విద్య(అవకాశాలు, నాణ్యత, సమానత్వం), టెక్నాలజీ, ఉపాధి(అవకాశాలు, వేతనం, పరిస్థితులు), రక్షణలు, వ్యవస్థలు(సామాజిక రక్షణలు,సమీకృత వ్యవస్థలు) అనే ఐదు ప్రధాన అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో సామాజిక చైతన్యాన్ని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక చైతన్యానికి ప్రధాన అడ్డంకులుగా న్యాయమైన వేతనాలు, సామాజిక రక్షణ, జీవితకాలం నేర్చుకోవడం ఉన్నాయని ఆ నివేదిక పేర్కొనింది. ఈ విషయాల్లో భారత దేశం 82 దేశాల్లో 76వ స్థానంలో ఉంది, జీవితకాలం అధ్యయనం విషయంలో అది 41వ స్థానంలో, పని వరిస్థితుల్లో 53వ స్థానంలో ఉంది. సామాజిక రక్షణ విషయంలో 76వ స్థానంలో ఉండగా, న్యాయమైన వేతన పంపిణీ విషయంలో 79వ స్థానంలో నిలిచింది.

జాబితాలో తొలి అయిదు స్థానాల్లో ఉన్న దేశాలన్నీ స్కాండినేవియా దేశాలే కాగా, సామాజిక చైతన్యం మెరుగుపడ్డం వల్ల ఎక్కువ లబ్ధి పొందే దేశాల్లో చైనా, అమెరికా,భారత్, జపాన్, జర్మనీ ఉన్నాయి. తొలి అయిదు స్థానాల్లో ఉన్న దేశాల్లో డెన్మార్క్ 85 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు మూడూ 83 పాయింట్లకు పైగా సాధించి తర్వాతి స్థానంలో నిలిచాయి. 82 సాయింట్లతో ఐస్‌లాండ్ తర్వాతి స్థానంలో ఉంది. టాప్10లోని మిగతా దేశాల్లో నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్ వరసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

India ranks 76th in Social Mobility Index
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News