Thursday, April 18, 2024

స్మిత్ సెంచరీ…. టీమిండియా లక్ష్యం 287

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. భారత జట్టు ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది.  ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో స్మిత్ 117 బంతుల్లో సెంచరీతో చెలరేగాడు. స్మిత్ 132 బంతుల్లో 131 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రెండో వికెట్‌పై స్మిత్, లబుస్కాంజే 127 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. లబుస్కాంజే 54 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కారే 35 పరుగులు చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫించ్ 19 పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. డేవిడ్ వార్నర్ మూడు పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  కమ్మీస్, స్టార్క్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో టర్నర్(4), హజేల్ హుడ్(1) నాటౌట్, అగర్ (11) నాటౌట్, జంపా(1)గా పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా  జడేజా రెండు వికెట్లు, షైనీ, కులదీప్ యాదవ్ చెరో ఒక వికెట్ తీశారు.

 

India target is 309 in Ind vs Aus Match

 

India target is 309 in Ind vs Aus Match
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News