Thursday, May 2, 2024

భారత్ సూపర్‌ పవర్ అయితీరుతుంది

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారతదేశం త్వరలోనే సూపర్ వపర్ అవుతుందని, అమెరికాతో మిత్రదేశపు స్థాయిని మించిపోతుందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. భారతదేశం ఓ మహత్తర శక్తి అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయని, అత్యంత విశిష్టమైన వ్యూహాత్మక వైఖరిని సంతరించుకున్న దేశం స్థాయిని తక్కువగా పరిగణించలేమని వైట్‌హౌస్ నుంచి ఆసియా వ్యవహారాల పర్యవేక్షక సమన్వయకర్త కర్ట్ కాంప్‌బెల్ వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక భద్రతా విషయాల సంబంధిత అస్పెన్ సెక్యూరిటీ ఫోరం సమావేశాలలో కాంపెబెల్ ఓ ప్రశ్నపై స్పందించారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత 20 ఏళ్లల్లో శరవేగంతో వృద్ధి చెందాయని, ఇతర ఏ దేశంతో పోల్చుకోలేని రీతిలో ఈ సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

21వ శతాబ్ధంలో అమెరికాకు ఇండియానే అత్యంత ప్రాధాన్యత గల మిత్రదేశం అవుతుందని, ఇప్పటి మిత్రదేశం భారత్ ఇకపై గొప్ప శక్తివంత దేశం అవుతుందని స్పష్టం చేశారు. ఇది భారత్ పట్ల తన ఆలోచన అని వివరించారు. ఇరుదేశాల మధ్య స్నేహం ఇంతకాలం పటిష్టంగా నిలవడానికి కారణాలు ఏమిటనేవి తాను విశ్లేషించలేనని తెలిపారు. భారత్‌లో అమెరికా మరిన్ని పెట్టుబడులకు దిగుతుంది. దీనికి పరిమితి ఉండదు, ఇదే విధంగా ప్రజల మధ్య సంబంధాలు ఇనుమడింపచేసుకోవడం , సాంకేతిక శాస్త్రీయ ఇతర రంగాలలోకలిసికట్టుగా సాగడం వంటికీలక పరిణామాలు ఉంటాయని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News