Monday, June 5, 2023

చెలరేగిన కోహ్లీ, రాహుల్, శ్రేయస్.. కివీస్ పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్ లో శుభారంభం చేసింది. దీంతో భారత్ ఐదు టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.  కెప్టెన్ విరాట్ కోహ్లీ(45) రాణించగా.. ఓపెనర్ కెఎల్ రాహుల్(56), శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్)లు అర్థ సెంచరీలతో మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ ఒక ఓవర్ మిగిలిండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(30), మన్రో(59) శుభారంభం అందించగా..కెప్టెన్ విలియమ్సన్(51), టేలర్(54)లు అర్థ సెంచరీలతో రాణించారు.

India win 1t T20 Match against New Zealand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News