Friday, April 26, 2024

71 వేల టూత్‌పిక్స్‌తో జాతీయ జెండా….

- Advertisement -
- Advertisement -

 

ఛండీగఢ్: పంజాబ్‌లోని అమృత్ సర్‌లో ఓ ఉపాధ్యాయుడు 71 వేల టూత్‌పిక్స్‌తో తయారు చేసిన జాతీయ జెండా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 71 వేల టూత్ పిక్స్‌తో బల్జీందర్ సింగ్ అనే టీచర్ నలబై రోజులలో జాతీయ జెండాను తయారు చేశాడు. ఎప్పుడు జాతీయ జెండా విషయంలో ఎదో ఒకటి చేయాలని ఆలోచించేవాడినని, అందుకే 40 రోజుల్లో టూత్‌పిక్స్‌తో జాతీయ జెండాను తయారు చేశానని, అత్యంత పొడవైన జాతీయ జెండా తయారు చేయడానికి కృషి చేస్తానని మీడియాకు తెలిపాడు. దీంతో సదరు టీచర్ కు ట్విట్టర్ సెల్యూట్ తెలిపింది. అతడి దేశ భక్తికి సెల్యూట్ చేస్తున్నానని ఉజ్వల్ సింగ్ అనే  నెటిజన్ ప్రశంసిస్తున్నారు. విశాల్ అనే నెటిజన్ వెల్‌డన్ బ్రదర్ అని కామెంట్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Teacher creates national flag with 71k toothpicks,A government school teacher, Baljinder Singh from Amritsar has made a national flag using toothpicks.

 

 

Teacher creates national flag with 71k toothpicks
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News