Home తాజా వార్తలు బాలాపూర్ తహసీల్దార్ ను పెట్రోల్ పోసి చంపుతానని బెదిరింపు….

బాలాపూర్ తహసీల్దార్ ను పెట్రోల్ పోసి చంపుతానని బెదిరింపు….

 

రంగారెడ్డి: బాలాపూర్ తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని తాహసీల్దార్ విజయ రెడ్డి ని చంపినట్టు పెట్రోల్ తో దాడి చేసి చంపుతానన్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పురుషోత్తమ్ ను బాలాపూర్ తాహసీల్దార్ అడ్డుకున్నాడు. దీంతో మాడల పురుషోత్తం పెట్రోల్ బాటిల్ తో తాహసీల్దార్ ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించాడు. వెంటనే పురుషోత్తమ్ రంగారెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు పురుషోత్తమ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు, పోలీసులను బెదిరించినట్టు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. రాజకీయ నాయకుడినంటూ చాలా మందిని ఇతడు మోసం చేసినట్టు విచారణలో తేలింది.

 

 Person threat to Balapur MRO with Petrol Bottle