Friday, April 19, 2024

రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఏడు పరుగులకే ఔటైనా టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటీ, అనుకుంటున్నారా?.. బ్యాట్స్ మెన్ గా విఫలమైన రోహిత్ ఫీల్డింగ్ లో ఆకట్టుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు ఆదినుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓవర్ కు పది పరుగుల చొప్పున ఓపెనర్లు చెలరేగడంతో స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోంది. వీరి దెబ్బకు కివీస్ అలవోకగా 240 పరుగుల స్కోరు చేస్తుందని అందరూ భావించారు. ఈ దశలో మ్యాచ్ ఎనిమిదో ఓవర్ వేసిన శివమ్ దూబే బౌలింగ్ లో మార్టిన్ గుప్టిల్ భారీ షాట్ కు యత్నించాడు. అయితే, బౌండరీ లైన్ వద్ద ఉన్న రోహిత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో గుప్టిల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. రోహిత్ క్యాచ్ పట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద్భుతమైన క్యాచ్ పట్టి భారత్ కు బ్రేకిచ్చిన రోహిత్ ను మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తొలి టీ20 మ్యాచ్ లో కివీస్ పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20 సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Rohit Sharmas stunning catch at boundary against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News