Wednesday, April 24, 2024

భారత్ చేతిలో పాక్ చిత్తు

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ 2023లో భారతజట్టు ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్ నిర్దేశించిన విజయలక్ష్యాన్ని టీమిండియా ఓవర్ మిగిలి ఉండగానే 19ఓవర్లకే ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. ధనాధన్ షెఫాలీవర్మ 25బంతుల్లో 4ఫోర్లుతో 33పరుగులు చేసి శుభారంభాన్ని అందించగా జెమీమా రోడ్రిగ్స్ 38బంతుల్లో 8ఫోర్లుతో 53పరుగులు చేసి కీలక మెరిసింది. వికెట్‌కీపర్ రీచాఘోష్ 20బంతుల్లో 5ఫోర్లుతో సాధించి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. అజేయ హాఫ్‌సెంచరీతో అలరించిన రోడ్రిగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా పాక్ స్కిప్పర్ మరూఫ్ కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్ ఆల్‌రౌండ్ ప్రతిభ ముందు వెలవెలబోయింది.

పాక్‌కు దీప్తీ షాక్
కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది. మున్నీబా అలీ, జవేరియా ఖాన్ పాక్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రేణుకాసింగ్ భారత్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించింది. తొలి ఓవర్లో పాక్ ఓపెనింగ్ జోడీ 3పరుగులు సాధించింది. రెండో ఓవర్లో కుడిచేతివాటం ఆఫ్‌స్పిన్నర్ దీప్తీశర్మ రాగా మూడో బంతిని స్కూప్‌షాట్ ఆడిన జవేరియా ఖాన్ బంతిని బౌండరీకి తరలించింది. అయితే ఆ తర్వాత బంతికే భారీ షాట్‌కు యత్నించి షార్ట్‌ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ కౌర్ చేతికి దొరికిపోయింది. 10పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ పడింది. జవేరియా ఔటవడంతో ఎడమచేతివాటం బ్యాటర్, పాక్ స్కిప్పర్ మరూఫ్ క్రీజులోకి వచ్చింది. ఇరువురు సంయమనంగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి పాకిస్థాన్ వికెట్ నష్టానికి చేసింది.

రాధాయాదవ్ స్పిన్ జోరు
పవర్ ప్లే ముగిసిన తరువాత ఓవర్లోనే రాధాయాదవ్ బౌలింగ్‌లో పాకిస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. రాధ బౌలింగ్‌లో మున్నీబా అలీ స్టంపౌట్ చేసింది. ఈక్రమంలో ఎనిమిదో ఓవర్లో పాకిస్థాన్‌కు వస్త్రాకర్ మరో షాక్ ఇచ్చింది. వస్త్రాకర్ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కోబోయిన దార్ వికెట్‌కీపర్ రీచాఘోష్ చేతికి చిక్కి డకౌట్ అయింది. దీంతో 43పరుగులకే పాక్ 3కీలక వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు ధాటికి పాక్ బ్యాటర్లు విలవిలలాడగా రాధాయాదవ్ 13వ ఓవర్లో అమీన్ పెవిలియన్‌కు పంపింది. రాధ బౌలింగ్‌లో అమీన్ వికెట్‌కీపర్ రీచాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 13ఓవర్లకు పాక్‌స్కోరు 74/4కు చేరుకోగా కెప్టెన్ మరూఫ్, ఆయేషా జోడీ జట్టు బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లారు. ఈ జోడీ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచారు. ఈక్రమంలో 18వ ఓవర్లో వస్త్రాకర్ బౌలింగ్‌లో తొలి బంతిని తరలించిన పాక్ కెప్టెన్ బిస్మా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మొత్తంమీద నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు నష్టానికి చేసింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇదే అత్యధిక స్కోరుకాగా భారత్‌పై కూడా 149పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. పాక్ స్కిప్పర్ మరూఫ్ ఆయేషా నసీమ్ నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో రాధాయాదవ్ రెండు వికెట్లు తీయగా, రేణుకాసింగ్, పూజ తలో వికెట్ పడగొట్టారు.

షెఫాలీ శుభారంభం
పాకిస్థాన్ నిర్దేశించిన 150పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు యస్తిక, షెఫాలీవర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఫాతిమా సనా పాక్ బౌలింగ్ ఎటాక్ ప్రారంభించగా రెండో బంతినే బౌండరికి తరలించి శుభారంభాన్ని అందించింది. భారత ఓపెనింగ్ జోడీ బౌండరీలతో విరుచుకుపడటంతో స్కోరుబోర్డు పరుగెత్తింది. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇక్బాల్ విడదీసింది. 20బంతుల్లో రెండు ఫోర్లుతో 17పరుగులు చేసిన యస్తిక ఓవర్లో ఇక్బాల్ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌మీదుగా షాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి చేసింది. యస్తిక నిష్క్రమించడంతో కుడిచేతివాటం బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ క్రీజులోకి వచ్చింది. షెఫాలీ జోరుకు జెమీమా అండగా నిలవడంతో స్కోరు పుంజుకుంది. ఈక్రమంలో 10వ ఓవర్లో తొలి బంతికి దూకుడుకు అడ్డుకట్ట పడింది. నష్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌కు యత్నించిన షెఫాలీ ఉన్న అమీన్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో షెఫాల్ ఔటయింది. 25 బంతుల్లో నాలుగు ఫోర్లుతో 33పరుగులు చేసిన షెఫాలీవర్మ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చింది. భారత్ స్కోరు 10ఓవర్లకు 67/2కు చేరుకుంది.

జెమీమా, రీచా దూకుడు
జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌కౌర్ జోడీ దూకుడుగా ఆడుతూ స్కోరును పెంచేందుకు యత్నించింది. ఇరువురు సంయమనం పాటిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలించడంతో స్కోరుబోర్డు వేగం అందుకుంది. 13ఓవర్లకు టీమిండియా స్కోరు 2వికెట్లకు 92పరుగులుకు చేరింది. ఈదశలో భారత్‌జోడీని సంధూ అడ్డుకుని ఔట్ చేసింది. 12బంతుల్లోరెండు ఫోర్లుతో 16పరుగులు చేసిన కౌర్..సంధూ బౌలింగ్‌లో మరూఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కీపర్ రీచాఘోష్ క్రీజులోకి వచ్చింది. 15ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు సెంచరీ మార్కుదాటి 103పరుగులుకు చేరుకుంది.

ఈ దశలో చివరి ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి రావడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. 17ఓవర్లకు స్కోరు 122/3 చేరడంతో లక్షం 18బంతుల్లో 28పరుగులుకు చేరుకుంది. 18వ ఓవర్లో రీచాఘోష్ హ్యాట్రిక్ బౌండరీలు బాదడంతో మ్యాచ్ భారత్‌వైపు మొగ్గు చూపింది. మరుసటి ఓవర్లో రోడ్రిగ్స్ కూడా బంతిని బౌండరీకి తరలించడంతో టీమిండియాపై ఒత్తిడి తగ్గింది. జెమీమా, రీచా 31బంతుల్లో 50పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 19వ ఓవర్లో చివరి రెండు బంతులను జెమీమా రోడ్రిగ్స్ బౌండరీకి తరలించడంతో భారతజట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 151పరుగులు చేసి విజయలక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. మొత్తంమీద టీమిండియా 3వికెట్లను కోల్పోయి చేసి తేడాతో గెలిచి పొట్టి ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News