Tuesday, May 7, 2024

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

High Court

 

హైదరాబాద్‌ : క్యాబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని, సచివాలయం పై తదుపరి అదేశలు ఇచ్చేంత వరకు సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయారదని బుధవారం నాడు ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది. ఈక్రమంలో కొత్త సచివాలయ నిర్మాణంపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోలేదని అడిషనల్ ఎజి తన వాదనలు వినిపించారు. అయితే నూతన సచివాలయం పై క్యాబినెట్ పూర్తి ఫైనల్ నమూనా నివేదిక తీసుకుని కోర్టుకు రావాలని, మంత్రి మండలి ఆమోదం పోందేవరకు నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఈ సందర్బంగా ఆదేశాలిచ్చింది.

సచివాలయానికి ఏలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు ఎందుకు సచివాలయం భవనాల కూల్చివేత చర్యలు చేపట్టారని, కూల్చివేత పై ప్రభుత్వం ను సమగ్ర నివేదిక కోరింది. అయితే నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. డిజైన్ ,ప్లాన్ పూర్తి కానప్పుడు, కూల్చి వేతలు ఎందుకని, అవసరమైన టెక్నాలజీ ఉన్న డిజైన్, ప్లాన్ ఇంకా రెడీ కాలేదని చెప్పడం లో అర్ధం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేతకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, మరి డిజైన్ ప్లాన్ కోసం ఎందుకు క్యాబినెట్ లో తీసుకోలేదని ప్రశ్నిస్తూ తదుపరి విచారణ ఈనెల 17కి వాయిదా వేసింది.

Inquiry in High Court on Secretariat demolition
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News