Saturday, April 27, 2024

నాన్‌వెజ్ అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

Non Veg Sales

 

హైదరాబాద్ : కరోనా వైరస్ ఎఫెక్ట్ నాన్ వెజ్ అమ్మకాలపై పడింది. జంతువుల వల్లే వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాంసాహారం తినేవారు భయపడుతున్నారు. ఉన్నపళంగా చికెన్, మటన్‌తో పాటు చేపలు, ప్రాన్స్ వంటి సీ ఫుడ్ తినడం ఆపేశారు. కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రజలను మరింత కలవరపెడుతున్నాయి. చైనా నుండి వచ్చిన వారితో ఈ వైరస్ ఇండియాలో వ్యాపించిదనే వార్తలొచ్చాయి. కేరళలో రెండు పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి.

గాంధీ హాస్పిటల్లో అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలోటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాపించకుండా ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జంతువుల నుంచే వైరస్ ఎక్కువగా వస్తుందనే కారణంతో చికెన్, మటన్, చేతులు అంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీంతో గిరాకీ లేక నాన్ వెజ్ షాపులు డీలాపడుతున్నాయి.

తగ్గిన చికెన్ ధరలు
చికెన్ ద్వారా కరోనా వ్యాపిస్తుందనే ప్రచారంతో కోడి మాంసం విక్రయాలు భారీగా పడిపోయాయి. చికెన్ తినడానికి జనం జంకుతుండటంతో దాని ప్రభావం విక్రయాలపై పడింది. ఫలితంగా వారం పది రోజుల్లోనే చికెన్ అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. రోజుకు 80 నుంచి 100 కిలోల చికెన్ విక్రయించే షాపుల్లో ఇప్పుడు 50- నుంచి 60 కిలోలు మాత్రమే విక్రయిస్తున్నామని దుకాణదారులు వాపోతున్నారు. డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు తగ్గాయి. నగరంలో కిలో చికెన్ ధర రూ.180 నుంచి రూ.140కి పడిపోయింది. చికెన్ కారణంగా కరోనా సోకుతుందనే భయాందోళనల కారణంగా చాలా మంది జనం ఖరీదు ఎక్కువైనా మటన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని షాపు యజమానులు చెబుతున్నారు.

దీంతో మటన్ ధరలు యథాతదంగా ఉండగా, చికెన్ ధరలు మాత్రం కిలోపై రూ.40 వరకు తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సగటున రోజుకు 5 లక్షల కిలోల చికెన్ విక్రయిస్తుంటారు. ఈ సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో సీన్ రివర్స్ అయ్యింది. మటన్, చికెన్, చేపలు తింటే కరోనా వైరస్ రాదని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. మాంసాన్ని బాగా ఉడికించి తినడం వల్ల జంతుమాంసం ద్వారా వచ్చే జబ్బులు రాకుండా చూసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం వీటికి దూరంగానే ఉంటున్నారు.

Corona Effect on Non Veg Sales
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News