Tuesday, March 19, 2024

ఇళ్లల్లో పనివాళ్లుగా చేరి.. దోచేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పనివాళ్లుగా ఇళ్లల్లో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నగర పోలీసు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ఉన్న భయంకరమైన ముఠా నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బషీర్‌బాగ్ కమీషరేట్‌లో కమీషనర్ అంజనీకుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ.. బీహార్ రాష్ట్రం మధుబని జిల్లాకు చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారని, అందులో ముఠా నాయకుడు రమాషిప్ ముఖియా అలియాస్ కరణ్, సభ్యులు భగవత్ ముఖియా(32), భోలా ముఖియా(35), హరిషాచంద్ర ముఖియాలను అరెస్టు చేసినట్లు, రాహుల్ ముఖియా, పితాంబర్ మండలం పరారీలో ఉన్నట్లు తెలిపారు . వీరంతా రెక్కి నిర్వహించి చోరీ చేసేందుకు ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటారని, అనంతరం ఇండ్లలో పనికి చేరి చోరీ చేస్తుంటారని పేర్కొన్నారు. వీరిలో గ్యాంగ్ లీడర్ ఉండే భగవత్ ముఖియా ఏజెన్సీ ద్వారా వంటవాడిగా,అవసరమైతే పనుల్లో సేవకుడిగా చేరుతాడని, అనంతరం చుట్టుపక్కల ఇండ్లలో తన గ్రూపు సభ్యులను పనికి కుదిరిస్తాడు. ఇలా పనిచేస్తూ ఆయా ఇళ్లలో ఉండే నగలు, ఇతర విలువైన వస్తువులను దొంగతనం చేసి పారిపోయేవాళ్లని వెల్లడించారు.

బంజారాహిల్స్‌లోని గ్లాస్ వ్యాపారి కపిల్ ఇంట్లో పనికి కుదిరి 45రోజుల్లో దొంగతనం చేసినట్లు , చోరీ చేసిన వెంటనే బీహార్‌కు పారిపోయినట్లు చెప్పారు. నెల రోజుల పాటు బంజారాహిల్స్ పోలీసులు బీహార్‌లో పలు ప్రాంతాల్లో గాలించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఈముఠా 08 రాష్ట్రాల్లో ఈ తరహా చోరీలకు పాల్పడిందని, వీరిలో ముగ్గురిని జనవరి 12న అరెస్టు చేశామని, వారు ఇచ్చిన సమాచారంతోనే రామషిస్ ముఖియా అదుపులోకి తీసుకున్నమన్నారు. అనంతరం జాయింట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ ప్రసంగిస్తూ ఈగ్యాంగ్‌లో మొత్తం 20మంది ఉన్నట్లు, ఇప్పటివరకు 50కిపైగా 8 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని, రాహుల్ ముఖియాపై రూ.25వేల నగదు ఢిల్లీ పోలీసు ప్రకటిచేసినట్లు పేర్కొన్నారు. దొంగతనాలు చేసే సమయంలో హత్యలు చేయడానికి వెనకాడరని, 2005లో వీరిపై కేసు నమోదైనట్లు వివరించారు. నేరాలు చేసిన తరువాత బీహార్, నేపాల్ ప్రాంతాలకు పారిపోతారని వెల్లడించారు.

Interstate Robbery gang arrested in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News