Saturday, April 27, 2024

సిఎం కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహిస్తాం

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని
జెర్సీ, విన్నర్, రన్నర్ ట్రోఫీల ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

KCR Birth Day

మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం కెసిఆర్ జన్మదినోత్సవాన్ని (ఫిబ్రవరి 17) ను పురస్కరించుకొని తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎం కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారుల జెర్సీ, విన్నర్, రన్నర్‌ల ట్రోఫీలను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం 67వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో చీఫ్ మినిస్టర్ కప్ (CM Cup) క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంట్ లో 9 క్రికెట్ జట్లు పాల్గొంటాయని ఆయన తెలిపారు.

9 జట్ల వివరాలు ఇలా…

1. టాలీవుడ్ తల్వార్ XI,
2. టాలీవుడ్ టివి ఆర్టిస్ట్స్ XI,
3. టిఎన్జీఓ XI,
4. పోలీస్ XI,
5. టాలీవుడ్ టెలివిజన్ హీరోస్ XI,
6. సిఐఐ XI,
7. ప్రెస్ క్లబ్ XI,
8. టిజిఓ XI,
9. ఎమ్మెల్యే XI

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, టిజిఓ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, అరుణ్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు గoడూరి వెంకట్, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్, టిఎన్జీఓ నాయకులు ముజీబ్, యూనియన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

 

CM Cricket Cup Tournment Start at KCR Birth Day

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News