Saturday, July 27, 2024

అడ్వెంచరస్ జర్నీ

- Advertisement -
- Advertisement -

Interview with Director Krish

 

‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఈనెల 8న విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు …

ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం…

పుస్తకం రాయడం వేరు… దాన్ని సినిమాగా తీయడం వేరు. పుస్తకంలో రాసిన దానిని సినిమాగా తీయాలంటే దానికి కొన్ని పరిమితులుంటాయి. సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. అదొక అద్భుతమైన కథ. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం.

అడ్వెంచరస్ జర్నీ…

ఊరి జనాభాకే నీళ్లు లేనప్పుడు.. గొర్రెలకు ఎక్కడి నుంచి తెస్తారు. అందుకే వాటిని కొండ ప్రాంతానికి తీసుకెళ్తారు. సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరి అవుతాం. ఈ సినిమా చేయడం అడ్వెంచరస్ జర్నీ. గొర్రెల భాష రాలేదు కానీ వాటిని ఎలా అదుపు చేయాలో తెలిసింది.

అలా వైష్ణవ్ వచ్చాడు…

‘కొండపొలం’ గురించి వైష్ణవ్ తేజ్‌కు చెబితే.. ‘మీరు హరిహరవీరమల్లు చేస్తున్నారు కదా’ అని అన్నాడు. పవన్ కళ్యాణ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నానని చెప్పాను. అయితే సరే అని వైష్ణవ్ అన్నాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, చిరంజీవితో వైష్ణవ్ ఈ చిత్రం గురించి చెప్పాడు. ఆ తరువాత సాయిధరమ్ తేజ్, వాళ్ల అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అలా వైష్ణవ్ ఈ సినిమాలోకి వచ్చాడు.

పాత్ర కోసం స్లిమ్‌గా…

జ్ఞానశేఖర్ సూచనతోనే రకుల్‌ను ఈ సినిమాకు తీసుకున్నాం. కెమెరామెన్ చెబితే ఎప్పుడూ తప్పుకాదు. అలా ఈ కథను రకుల్‌కు చెప్పేందుకు వెళ్లాను. కథ చెబుతుంటూనే ఆమె మొహంలోని హావాభావాలను చూసి ఓబులమ్మ పాత్రకు సరిపోతుందని అనుకున్నాను. ఇక ఈ పాత్ర కోసం రకుల్ స్లిమ్‌గా మారింది.

నవంబర్ నుంచి మళ్లీ ‘హరి హర వీరమల్లు’…

పవన్‌కళ్యాణ్‌తో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మార్చి 12 వరకు షూటింగ్ చేశాం. దాదాపు 25 శాతం పూర్తయింది. ఆ తరువాత లాక్‌డౌన్ వచ్చింది. సినిమా పరిశ్రమ మొత్తం స్థంభించిపోయింది. ఆతర్వాత గ్యాప్‌లో ‘కొండపొలం’ చేశాను. నవంబర్ రెండో వారం నుంచి మళ్లీ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ప్రారంభిస్తాం.

హాట్‌స్టార్‌కు కథ రాస్తున్నా…

జంగిల్ బుక్‌లాంటి సినిమాను వెంకటేష్‌తో చేయాల్సింది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తరువాత ఆ సినిమా చేయాల్సింది. కానీ ‘అతడు అడవిని జయించాడు’ అనే పుస్తకం హక్కులు దొరకలేదు. ఫిల్మ్ మేకింగ్‌లో నాకు నచ్చింది రచనే. ఇప్పుడు నేను హాట్ స్టార్‌కు ఓ కథ కూడా రాస్తున్నాను.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News