Thursday, April 25, 2024

కాన్సెప్ట్ ప్రకారం హీరోను ఎన్నుకుంటా

- Advertisement -
- Advertisement -

 VI Anand

 

మాస్ మహారాజా రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు వి.ఐ ఆనంద్‌తో ఇంటర్వూ విశేషాలు…

కొత్త అనుభూతి…
సినిమాకు కాన్సెప్ట్ ముఖ్యం. హీరోని బట్టి కథను రాసుకోను. కాన్సెప్ట్ ప్రకారం హీరోను ఎన్నుకుంటాను. కాన్సెప్ట్‌ను, కమర్షియల్‌ను బ్యాలెన్స్ చేసుకుని ‘డిస్కో రాజా’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వాలని ఈ సినిమా చేశాను. –

రీసెర్చ్ చేసి తీసిన సినిమా…
నాకు చిన్నప్పటి నుండి సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే ఇష్టం. ఒకవిధంగా సైన్స్ ఫిక్షన్ నా ఫేవరేట్ జోనర్ కూడా. ఇక ఈ ‘డిస్కో రాజా’ కాన్సెప్ట్ పది సంవత్సరాల క్రితమే నా మైండ్‌లోకి వచ్చింది. ఎప్పటి నుండో ఈ సినిమా కథకు సంబంధించి పూర్తి వివరాల కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాను. అలా రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఇది.

అన్ని రకాల ఎమోషన్స్‌తో…
-ఈ సినిమా దేనికీ స్ఫూర్తికాదు. న్యూస్‌పేపర్‌లో గత ఏడాది బయో కెమికల్ ల్యాబ్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. ఆ ల్యాబ్ రీసెర్చ్ సక్సెస్ అయితే ఎలా ఉంటుందనే కోణంలో స్క్రిప్ట్ రాసుకున్నా. స్క్రిప్ట్ బాగా వచ్చింది. నేచురల్ సైన్స్ ఫిక్షన్ అయినా ఎక్కడా ఫోర్స్‌డ్ ఎలిమెంట్స్ కనిపించవు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సినిమాలో మంచి హ్యూమర్‌తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ సహజంగా ఉంటాయి.

-ఓ గ్యాంగ్‌స్టర్ కథ…
– ఇది వేరే నటుడితో తీయాలనుకున్న కథ కాదు. ‘డిస్కో రాజా’ రాసేటప్పుడే రవితేజకు సెట్ అవుతుందన్న ఆలోచనతో రాశాను. డిస్కోరాజా ఓ గ్యాంగ్‌స్టర్. మ్యూజికల్ లవింగ్ క్యారెక్టర్ తనది. కథ ప్రకారం 1980నాటి కాలం కావాలి. రవితేజ దానికి సరిగ్గా సరిపోతారు. ఆయన నటన, డైలాగ్‌లు భిన్నంగా ఉంటాయి.

క్యారెక్టర్‌లో లీనమై…
-రవితేజకి మొదటినుంచి కూడా డిస్కో అంటే చాలా ఇష్టమట. మిథున్ చక్రవర్తి నటించిన ‘డిస్కో డ్యాన్సర్’లో ‘ఐయామే డిస్కో డ్యాన్సర్’ అనే పాటకు చాలా కనెక్ట్ అయ్యారు. అందుకే క్యారెక్టర్‌లో లీనమై ఆయన నటించారు. ఇక- సినిమా మొత్తం అంతా డిస్కోరాజాదే. ఈ టైటిల్‌కు వివరణ ఏమిటనేది మూవీలో చూడాల్సిందే.

తదుపరి చిత్రాలు…
– నా తదుపరి సినిమాను గీతా ఆర్ట్ బ్యానర్‌లో చేయాలి. నిఖిల్‌తోనా, ఇతర హీరోతోనా అన్న విషయం త్వరలోనే అందరికీ తెలుస్తుంది. అయితే నాకు భిన్నమైన జోనర్‌లో సినిమాలు చేయాలనుంది.

Interview with director VI Anand
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News