Thursday, May 2, 2024

మహేష్ ఎప్పుడూ కూల్‌గా ఉంటారు

- Advertisement -
- Advertisement -

Rashmika Mandanna

 

ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల తార రష్మిక మందన్న. తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్నతో ఇంటర్వ్యూ…

అల్లరి చేసే క్యారెక్టర్…
-సినిమా ట్రైలర్ చూస్తే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. హీరో వెంటపడి బాగా అల్లరి చేసే క్యారెక్టర్ నాది. ఈ సినిమా ద్వారా నాకు ఫుల్ లెంగ్త్ కామెడీ చేసే అవకాశం దక్కింది.

ఎప్పుడూ కూల్‌గా ఉంటారు…
సూపర్‌స్టార్ మహేష్ బాబులో నాకు నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన డౌన్ టు ఎర్త్‌గా ఉంటారు. ఎప్పుడూ కూల్‌గా… చాలా కామ్‌గా ఉంటారు. అలాగే సరదాగా కూడా ఉంటారు.

మ్యానరిజమ్స్ ఉంటాయి…
సినిమాలో నా క్యారెక్టర్‌కి మ్యానరిజమ్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్‌లో చూపించినట్టు… ‘మీకర్ధమవుతుందా..? అనేది అందులో ఒకటి. ‘ఐయామ్ ఇంప్రెస్డ్’ అనే మరో మ్యానరిజమ్ కూడా ఉంటుంది. అలాగే ‘అబ్బబ్బబ్బా’ అనే మ్యానరిజమ్ కూడా ఉంటుంది.

మొదట్లో భయమేసింది…
సీనియర్ స్టార్ విజయశాంతి గురించి నేను చాలా విన్నాను. ఆమెతో కలిసి నటించాలనుకున్నప్పుడు మొదట్లో కొంత భయమేసింది. ఆమె పెద్ద యాక్టర్, లేడి అమితాబ్. అయితే మేడమ్‌తో కలిసి కేరళ షెడ్యూల్‌కి వెళ్లాను. అక్కడ ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టిన తరువాత రెండు రోజుల్లోనే క్లోజ్ అయ్యాను. నా కెరీర్ గురించి కూడా మేడమ్‌తో మాట్లాడేదాన్ని.

ఆమెతో సీన్స్ ఆకట్టుకుంటాయి…
విజయశాంతి, నా మధ్య పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ మేం కలిసి చేసిన సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

చాలా హ్యాపీగా ఉన్నా…
ఈ సినిమాలో నా క్యారెక్టర్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాలో నా క్యారెక్టర్ ఎందుకు..? ఏం చేస్తోంది..? అనే దానికి మంచి కారణం ఉంది. పైగా నా క్యారెక్టరైజేషన్‌లో కామెడీ కూడా బాగుంది.

అందుకే చేశా…
ముందుగా డైరెక్టర్ అనిల్ కథ చెప్పినప్పుడే నేను ఈ సినిమాలో నటిస్తానని చెప్పారు. ఇందులో నటిస్తున్నప్పుడు నా సీన్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రధానంగా నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా చేశాను. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరో, విజయశాంతి మరో కీలకమైన రోల్ చేస్తున్నారని ఇందులో నటించాను.

తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం నితిన్‌తో ‘భీష్మ’ చిత్రం చేస్తున్నాను. ఫిబ్రవరి నుండి సుకుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నాను. ఇంకా రెండు సినిమాలు కూడా ఉన్నాయి.

Interview with heroine Rashmika Mandanna
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News