Monday, April 29, 2024

ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

Delhi elections

 

11న ఓట్లు లెక్కింపు, ఎన్నికల కమిషన్ ప్రకటన

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నిక లు జరగబోతున్నాయి. అదే నెల 11న ఓట్ల లె క్కింపు ఉంటుంది. ఆ రోజే ఫలితాలు వెలువడవచ్చని ఎన్నికల ప్రధానాధికారి (సిఇసి) సునీ ల్ అరోరా తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఎన్నికలు న్యాయ ంగా జరిపేందుకు ఎన్నికల సంఘం (ఇసి) క ట్టుబడి ఉంది. 13,000 పోలింగ్ కేంద్రాల్ని ఏ ర్పాటు చేస్తాం. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు 90,000 మంది అధికారుల్ని ని యమిస్తున్నాం’ అన్నారు. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని కూడా ఇసి ధ్రువీకరించింది.

ఆ కారణంగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వ పథకాలనూ ప్రకటించే వీలుందని ఇసి ప్రభుత్వానికి గుర్తు చేసింది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ శాసన సభ కాలపరిమితి ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. ఆలోగా తప్పనిసరిగా నూతన ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. గత నెలలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత ఒక రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న మొదటి ఎన్నిక ఇది. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో దేశ రాజధానిలో ప్రభంజనం సృష్టించిన బిజెపి ఢిల్లీలో ఎదుర్కొనబోతున్న మొదటి ఎన్నిక కూడా ఇదే.

లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం ఏడు స్థానాలనూ బిజెపి కైవసం చేసుకుంది. మళ్లీ అధికారంకోసం ‘ఆప్’ : 2015 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 67 గెలుచుకొని భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. 2015లో బిజెపికి మిగిలిన మూడు సీట్లు రాగా, కాంగ్రెస్‌కు హస్తినలో శూన్య హస్తమే మిగిలింది. ఆప్ కు 54.3 శాతం ఓట్లు రాగా, బిజెపికి 32.3, కాంగ్రెస్‌కు 9.7 శాతం ఓట్లు వచ్చాయి.

Delhi elections on February 8
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News