Friday, March 29, 2024

హాజీపూర్ నిందితుడు ఉరికి అర్హుడే

- Advertisement -
- Advertisement -

Hajipur accused

 

శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్షకు అర్హుడే
పోక్సో కోర్టులో ప్రాసిక్యూషన్ వాదన
సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అరుదైన కేసుగా భావించాలి

మన తెలంగాణ/సిటీబ్యూరో: అమాయకులైన ఆడ పిల్లలను కిరాతంగా హత్య చేసిన హాజీపూర్ హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్షకు అన్ని విధాల అర్హుడని నల్గొండలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రాసిక్యూషన్ వాదించారు. శ్రావణి అత్యాచారం, హత్య కేసులో ఫోక్స్ స్పెషల్ కోర్టులో సోమవారంతో వాదనలు ముగిశాయి. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని, అతడు ఉరిశిక్షకు అర్హుడని వాదించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది అరుదైన కేసుల్లో అరుదైనదిగా భావించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

నిందితుడికి గతంలో కూడా నేరచర్రిత ఉందని తెలిపారు. ఒంటరి మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని చెప్పారు. కర్నూలులో మహిళలపై అత్యాచారం చేసి తర్వాత హత్య చేశాడని, విచారణలో ఈ విషయం బయటపడిందని అన్నారు. కేవలం తన లైంగికవాంఛలు తీర్చుకోవడం కోసమే మహిళలు, బాలికలను హత్య చేశాడని తెలిపారు. ఇది ఒక కేసుగా చూడవద్దని, సమాజానికి పట్టిన ఒక రుగ్మతగా పరిగణించాలని కోరారు. సహజన్యాయం ప్రకారం చూసినా,లాజికల్‌గా చూసినా నిందితుడికి ఉరిశిక్ష సబబేనని కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై త్వరలోనే కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.

Hajipur accused deserves to be hanged
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News