Saturday, July 27, 2024

ఛాలెంజింగ్‌గా ఫీలయ్యా

- Advertisement -
- Advertisement -

 Payal Rajput

 

‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకుంది పంజాబీ భామ పాయల్ రాజపుత్. ఇటీవల విడుదలైన ‘వెంకీ మామ’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది ఈ భామ. మాస్ మహారాజా రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన ‘డిస్కో రాజా’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అందుకే ఒప్పుకున్నా…
ఈ సినిమాలో నేను మొదటిసారిగా హెలెన్ అనే మూగ, చెవిటి అమ్మాయి క్యారెక్టర్ చేశాను. మూవీలో నా పాత్ర నిడివి కాస్త తక్కువే అయినప్పటికీ ఒక ముఖ్యమైన పాత్ర కావడంతో ఒప్పుకున్నాను. ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్‌గా ఫీలయ్యాను. కథాబలమున్న మంచి సినిమాతో కొత్త ఏడాది ఆరంభమవడం ఆనందంగా ఉంది.

ప్రతిక్షణం ఆసక్తిగా…
దర్శకుడు వి.ఐ.ఆనంద్ కథ చెబుతున్నప్పుడే తర్వాత ఏం జరుగబోతుందని ప్రతిక్షణం ఆసక్తిగా అనిపించింది. అలాగే ఈ పాత్ర నా కెరీర్‌లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకంతో నిడివి గురించి ఆలోచించకుండా ఈ చిత్రానికి అంగీకరించాను.

గైడ్‌గా, స్నేహితుడిగా సలహాలిచ్చారు…
ఈ సినిమాతో రవితేజ నాకు టీచర్‌గా మారిపోయారు. ఒక గైడ్‌గా, స్నేహితుడిగా నా కెరీర్‌కి సంబంధించిన ఎన్నో విలువైన సూచనలిచ్చారు. కథా పరంగా ఈ సినిమాలో నేను రెట్రో లుక్‌లో కనిపించాల్సి ఉంటుంది. దాని కోసం మా అమ్మ సలహాలు తీసుకున్నాను. 1980 కాలంనాటి హెయిర్ స్టైల్, వస్త్రధారణ, భావవ్యక్తీకరణ ఎలా ఉంటుందో అమ్మ ద్వారా తెలుసుకొని నటించాను. ఆ లుక్‌లో నన్ను చూసి మా అమ్మ ‘చాలా అందంగా కనిపిస్తున్నావు… అలాగే చక్కగా నటించావు’ అని మెచ్చుకుంది.

తదుపరి చిత్రాలు…
పరదీప్ దర్శకత్వంలో ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం చేస్తున్నాను. ఈ సినిమాలో నేను ఐపిఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాను. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అలాగే ఉదయనిధి స్టాలిన్ సినిమాతో ఈ ఏడాది తమిళంలో అరంగేట్రం చేయబోతున్నాను. అదేవిధంగా ఒక కన్నడ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో కొన్ని స్క్రిప్ట్ విన్నాను. ఇంకా ఫైనల్ కాలేదు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను.

Interview with Payal Rajput
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News