Thursday, May 2, 2024

రేయింబవళ్లు శ్రమిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Chiranjeevi

 

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తొలి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో నిర్మించిన ప్రత్యేక సెట్లలో చిత్రీకరణ వేగంగా పూర్తి చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో 99 రోజుల్లో చిత్రీకరణ మొత్తం ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా పూర్తి చేయాలనేది టార్గెట్. అందుకు మెగాస్టార్ ముందే కొరటాల నుంచి ప్రామిస్ తీసుకున్నారు. అందుకే కొరటాల ఎట్టి పరిస్థితుల్లో 99 రోజుల్లో షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టే దర్శకుడు కొరటాల జెట్ స్పీడ్‌తో చిత్రీకరణ సాగిస్తున్నారట.

తన గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారని తెలిసింది. ఈ స్పీడ్ వల్ల చిరు, -కొరటాల సహా ఇతర యూనిట్ సభ్యులు విశ్రాంతి అన్నదే లేకుండా రేయింబవళ్లు శ్రమించాల్సి వస్తోందట. రాత్రి వేళల్లోనూ నిరంతరం షూటింగ్ జరుగుతూనే ఉందని తెలిసింది. ప్రస్తుతం నైట్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో చిరు ఎక్కువగా నైటౌట్లు చేస్తున్నారట. కీలక సన్నివేశాలన్ని రాత్రి పూటే తెరకెక్కిస్తుండడంతో ఆ మేరకు కంటిపై కునుకు కరువైందని చెబుతున్నారు. కొద్దో గొప్పో పగటి వేళల్లోనే చిరంజీవికి సమయం లభిస్తుండడంతో ఉన్న సమయాన్ని నిద్రకే కేటాయిస్తున్నారని తెలిసింది.

Chiranjeevi doing hard work for his 152 movie
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News