Thursday, May 2, 2024

ఐపిఎల్ 2021: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:ఐపిఎల్ 2021లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచ్ ల్లో పక్కన పెట్టిన మనీష్ పాండేను సన్ రైజర్స్ తిరిగి జట్టులోకి తీసుకుంది. ఇక, ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ స్థానాన్ని మెరుగు పర్చుకోవాలని వార్నర్ సేన పట్టదలగా ఉంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై కూడా ఈ మ్యాచ్ లో గెలుపొంది సత్త చాటాలని భావిస్తోంది.

IPL 2021: SRH win toss and opt bat against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News