Wednesday, April 30, 2025

ఇవాళ రాజస్థాన్, బెంగళూరు మధ్య కీలక పోరు..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌ 2025లో భాగంగా గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈరోజు రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో 5 గెలుచిన బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ను ఓడించి తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని బెంగళూరు పట్టుదలగా ఉంది. ఇక, రాజస్థాన్ ఈసారి ఘోరంగా విఫలమవుతోంది. గెలుపు దాకా వచ్చి చేతులెత్తేస్తోంది. దీంతో ఆర్ఆర్.. పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ రాజస్థాన్ కు కీలకంగా మారింది. బెంగళూరు చేతిలో ఓడిపోతే రాజస్థాన్ కు ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News