Friday, May 3, 2024

‘మను చరిత్ర’ నుంచి ‘ఇప్పుడే పరిచయమే’ సాంగ్ లాంచ్

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన యూనిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘మను చరిత్ర’. ఈ చిత్రంలో శివ సరసన మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్ శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో విడుదల చేసిన టీజర్ శివ కందుకూరిని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసి క్యురియాసిటీని పెంచింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఇప్పుడే పరిచయమే పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. గోపిసుందర్ ఈ పాటని లవ్లీ అండ్ మెస్మరైజింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలపించేలా వుంది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News